: మిస్బా ఉల్ హక్ ఉద్వాసనకు రంగం సిద్ధం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. వెస్టిండీస్ తో త్వరలో జరగనున్న టెస్ట్ సిరీసే మిస్బాకు చివరిది కానుంది. ఈ మేరకు మిస్బాకు పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ కూడా స్పష్టమైన సూచనలు చేశాడు.
తనను కలవాలనుకుంటున్న మిస్బాతో మాట్లాడానని... అతని కెప్టెన్సీపై సుదీర్ఘంగా చర్చించానని షహర్యార్ తెలిపారు. క్రికెట్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని మిస్బాకు సూచించానని చెప్పారు. విండీస్ సీరిస్ కు మిస్బానే కెప్టెన్ గా నియమించామని... భవిష్యత్తుపై త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకుంటాడని భావిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మిస్బా వయసు 43 ఏళ్లని... విండీస్ సిరీస్ తర్వాత ఆయన ఇంకా ఆడుతాడని తాను భావించడం లేదని షహర్యార్ అన్నారు. టీ20 కెప్టెన్ గా ఉన్న సర్ఫరాజ్ ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా నియమించాలన్న కృత నిశ్చయంతో పాక్ బోర్డు ఉంది.