: అమెరికాలో అగ్నిప్రమాదం.. 21 మంది చిన్నారుల మృతి


అమెరికాలోని గ్వాటెమాలా నగరంలోని సాన్‌జోస్‌ పిన్యులా అనాథ ఆశ్రమంలో పరుపులకు మంటలు అంటుకోవడం ద్వారా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది పిల్లలు సజీవ దహనమయ్యారు. మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఆశ్రమంలో అనాథలు, వేరే ప్రాంతాల నుంచి పారిపోయి వచ్చిన పిల్లలు నివసిస్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా పరుపులకు నిప్పు అంటించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. 500 మంది నివసించగలిగే సామర్థ్యం ఉన్న ఈ ఆశ్రమంలో ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 800 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News