: 'వెల్ డన్ ఇషాంత్' అంటూ అశ్విన్ ట్వీట్... అంత వెక్కిరింపులు వద్దని ప్రీతీ అశ్విన్ ఎత్తిపొడుపు!
భారత క్రికెట్ జట్టులో కీలక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఎంత కీలక పాత్ర పోషించాడో అందరికీ తెలిసిందే. మ్యాచ్ విజయానికి ముఖ్యమైన వికెట్ ను తీయడంలో సహకరించి ఆస్ట్రేలియా పతనానికి ఇషాంత్ బీజం వేశాడన్న విషయం కూడా విదితమే. ఈ మ్యాచ్ అనంతరం, ఇషాంత్ తో దిగిన ఓ ఫోటోను అశ్విన్ తన ట్విట్టర్ ఖాతాలో పెడుతూ, "చివర్లో ఈ మనిషి చేసిన ఆరు పరుగులు ఎంతో విలువైనవి. వెల్ డన్ ఇషీ" అంటూ ట్వీట్ చేశాడు అశ్విన్.
ఈ ట్వీట్ వైరల్ అవుతుండగానే, అశ్విన్ భార్య ప్రీతి విభిన్నంగా స్పందించింది. ఓటమి పాలైన ఆస్ట్రేలియా ఆటగాళ్లకు గౌరవంగా వీడ్కోలు పలుకుతూ తీసుకున్న ఫోటోలు షేర్ చేసుకోవాలని సలహా ఇచ్చింది. వారిపై వెక్కిరింపులు, ఎత్తిపొడుపు చూపులు వద్దని వారించింది. ఈ మేరకు ప్రీతి పెట్టిన ట్వీట్, మరింతగా వైరల్ అయింది.