: నాలుగు సార్లకంటే ఏటీఎంను ఉపయోగించాల్సిన అవసరం ఏముంటుంది?: అరుంధతీ భట్టాచార్య


సాధారణంగా నెలకు నాలుగు సార్లకంటే ఎక్కువగా ఏటీఎంను వినియోగించాల్సిన అవసరం రాదని భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఖాతాదారులు తమ లావాదేవీల కోసం తప్పనిసరిగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో మొబైల్, ఇంటర్నెట్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఓ గృహస్తుడికి నెలకు నాలుగు సార్లకంటే ఎక్కువగా ఏటీఎంను ఉపయోగించాల్సినంత అవసరం ఏముంటుందని ఆమె ప్రశ్నించారు. ఇటువంటి అవసరం వ్యాపారులకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి ఖాతాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోక తప్పదని సూచించారు.

  • Loading...

More Telugu News