: స్మిత్ తప్పును తన మీద వేసుకున్న హ్యాండ్స్ కాంబ్


బెంగళూరు టెస్ట్ మ్యాచ్ లో స్మిత్ ఔట్ అయిన అనంతరం జరిగిన ఘటనకు తానే కారణమని ఆసీస్ క్రికెటర్ హ్యాండ్స్ కాంబ్ చెప్పాడు. వాస్తవానికి స్మిత్ బాక్స్ వైపు చూడలేదని చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడమని స్మిత్ కు తానే సూచించానని తెలిపాడు. తనకు డీఆర్ఎస్ నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పాడు.

ఘటన వివరాల్లోకి వెళ్తే, ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో స్మిత్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. కానీ, అక్కడ నుంచి వెళ్లకుండా హ్యాండ్స్ కాంబ్ తో చర్చించి, ఆ తర్వాత ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ చేతులు ఊపాడు. ఈ నేపథ్యంలో, స్మిత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. మోసపూరితమైన ఆటను ఆడుతున్నాడంటూ టీమిండియా కెప్టెన్ కోహ్లీ తీవ్ర విమర్శలు చేశాడు. 

  • Loading...

More Telugu News