: సైఫుల్లా దేశానికి ద్రోహం చేశాడు.. అతని మృత దేహం నాకొద్దు: సైఫుల్లా తండ్రి


లక్నోలోని ఠాకూర్ గంజ్ లో కొనసాగిన ఎన్ కౌంటర్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లాను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అయితే, ఈ ముష్కరుడి మృత దేహాన్ని తీసుకోవడానికి అతని తండ్రి సర్తాజ్ నిరాకరించాడు. ఓ దేశ ద్రోహి మృతదేహం తనకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశాడు. దేశ ప్రయోజనాలకు కూడా ఇది భంగం కలిగిస్తుందని చెప్పాడు.

ఏ పనీపాటా లేకుండా తిరుగుతున్న సైఫుల్లాను తాను కొట్టానని... దీంతో, రెండు నెలల క్రితం అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడని సర్తాజ్ తెలిపాడు. సోమవారం నాడు తనకు ఫోన్ చేసి, సౌదీ వెళుతున్నానని చెప్పాడని... ఆ మాటలే చివరి మాటలు అవుతాయని తాను అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నకొడుకే అయినా, దేశానికి ద్రోహం తలపెట్టిన వాడి మృత దేహం తనకు అవసరం లేదని చెప్పాడు.

  • Loading...

More Telugu News