: హెచ్-1బీ వీసాదారుల్లో మొదలైన మరో భయం


హెచ్-1బీ వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో మరో గుబులు మొదలైంది. మాజీ అధ్యక్షుడు ఒబామా అధికారంలో ఉన్నప్పుడు హెచ్-1బీ వీసాలున్న వ్యక్తుల జీవిత భాగస్వాములు కూడా పనిచేసే అవకాశాన్ని కల్పించారు. ఒబామా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో పలు అమెరికన్ సంస్థలు వాషింగ్టన్ డీసీలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు విచారణ నేపథ్యంలో, ఒబామా నిర్ణయంపై అభిప్రాయం ఏమిటని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగాన్ని కోర్టు కోరింది. దీంతో, ఈ విషయంపై స్పందించడానికి తమకు 60 రోజుల సమయం కావాలని ట్రంప్ యంత్రాంగం కోర్టుకు తెలిపింది.

ప్రస్తుత అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ కూడా హెచ్-1బీ వీసాపై వచ్చిన వారి భాగస్వాములకు వర్క్ పర్మిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ సదుపాయం వల్ల అమెరికన్లకు నష్టం వాటిల్లుతుందని, అమెరికన్లకు నిరుద్యోగ సమస్య అధికం అవుతుందని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో, దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే గుబులు భారతీయుల్లో పట్టుకుంది. ప్రతి రోజు ఏదో ఒక కొత్త సమస్య పుట్టుకొస్తుండటం వారిని కలవరపాటుకు గురి చేస్తోంది.

  • Loading...

More Telugu News