: అప్పుడప్పుడు మా అబ్బాయిని చూస్తే కోపమొస్తుంది!: రమా రాజమౌళి


తనకు సాధారణంగా టెన్షన్ అనేది ఉండదని ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, దర్శకుడు రాజమౌళి భార్య రమా రాజమౌళి తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ టీవీ ఛానెల్ తో తన మనసులో భావాలను పంచుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సాధారణ విషయాలకు తాను టెన్షన్ పడనని అన్నారు. టెన్షన్ ఉండదు కానీ కోపమొస్తుందని ఆమె చెప్పారు. కొన్ని సార్లు తన కొడుకును చూస్తే కోపం వస్తుందని ఆమె తెలిపారు. సినీ పరిశ్రమలో మేల్ డామినేషన్ ఉంటుందని అంగీకరించనని ఆమె అన్నారు. పరిశ్రమలో ఎవరి అవకాశాలు వారివేనని ఆమె చెప్పారు. కాగా, సినీ పరిశ్రమలో అద్భుతమైన విజయాలు అందుకున్న మగధీర, బాహుబలి వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు. 

  • Loading...

More Telugu News