: కోదండరామ్ పై ఫైర్ అయిన పిట్టల రవీందర్


జేఏసీ నిబంధనలకు వ్యతిరేకంగా టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ వ్యవహరిస్తున్నారని టీజేఏసీ నేత పిట్టల రవీందర్ మండిపడ్డారు. తాము అమ్ముడు పోయామంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కాదని తెలిపారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, సమష్టి కృషితోనే జేఏసీని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. మొన్న నిర్వహించాలనుకున్న ధర్నాలో నిరుద్యోగ అంశం పక్కదారి పట్టిందని, డిమాండ్లన్నీ ఎక్కడికో పోయాయని... కానీ, కోదండరామ్ అరెస్ట్ మాత్రం హైలైట్ అయిందని దుయ్యబట్టారు. కోదండరామ్ వ్యవహారశైలిని నిరుద్యోగులు, విద్యార్థులు అర్థం చేసుకోవాలని కోరారు. జేఏసీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా కోదండరామ్ వ్యవహరిస్తున్నారని పిట్టల ఆరోపించారు. తాము లేవనెత్తుతున్న ప్రశ్నలకు కోదండరామ్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News