: అది చాలా కామన్... 'త్రిషతో ఫోటో'పై వివరణ అవసరం లేదని భావిస్తున్న రానా!
సింగర్ సుచిత్ర విడుదల చేసిన రానా, త్రిషల ఫోటోపై స్పందించాల్సిన అవసరం లేదని రానా అనుకుంటున్నట్టు ఆయన స్నేహితులు వెల్లడించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ ఫోటో సృష్టించిన కలకలం అంతాఇంతా కాదన్న సంగతి తెలిసిందే. దీనిపై త్రిష ఇప్పటికే పరోక్షంగా స్పందించగా, బుగ్గపై పెట్టే ముద్దును 'పెక్' అంటారని, ఇది స్నేహితుల మధ్య చాలా కామన్ అని రానా భావిస్తున్నాడట. అనవసరంగా ఆ ఫోటోపై స్పందించడం ఎందుకని భావిస్తున్న ఆయన, వివరణ ఇవ్వాలని అనుకోవడం లేదని సమాచారం. తన ట్విట్టర్ ఖాతా ద్వారా సెలబ్రిటీల ప్రైవేట్ లైఫ్ పై సంచలన చిత్రాలను విడుదల చేస్తున్న సుచిత్ర ఖాతాలను ట్విట్టర్ ఇప్పటికే నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే.