: ఉగాదిపై క్లారిటీ వచ్చేసింది.. 29నే అంటున్న సిద్ధాంతులు


ఉగాది ఎప్పుడు జరుపుకోవాలన్న చిక్కుముడి వీడింది. 28నా? 29నా? అన్న విషయంలో స్పష్టత వచ్చింది. ఈనెల 29నే ఉగాదిని జరుపుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు గంగు భానుమూర్తి సహా పలువురు సిద్ధాంతులు పేర్కొన్నారు. హైదరాబాద్‌ నల్లకుంటలోని శ్రీసీతారామాంజనేయ సరస్వతీ దేవాలయంలో భానుమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం దృక్, పూర్వ గణిత పంచాంగ కర్తల సదస్సు నిర్వహించారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమణారావు సహా పలువురు సిద్ధాంతులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి శ్రీనివాస వాగ్దేయ సిద్ధాంత సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఈనెల 29నే ఉగాదిని జరుపుకోవాలని సూచించారు. ఐనవోలు అనంత మల్లయ్య సిద్ధాంతి కూడా ఇదే విషయాన్ని స్పష్టం  చేశారు.

  • Loading...

More Telugu News