: సాహా క్యాచ్ కు ఫిదా అయిపోయిన వెటరన్!
టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అభిమానులతో పాటు వెటరన్ లు కూడా ఫిదా అయిపోయారు. స్పైడర్ మేన్ తరహాలో ఫుల్ లెంగ్త్ డైవ్ తో మనిషి మొత్తం గాల్లో లేచి పట్టిన ఆ క్యాచ్ మ్యాచ్ కు హైలైట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఎడమ చేతివాటం బ్యాట్స్ మన్. ఆఫ్ స్పిన్నరైన అశ్విన్ ఆఫ్ వికెట్ మీద బంతిని సంధించి, లెగ్ వికెట్ వైపు తిరిగేలా బంతిని సంధించాడు. దానిని సమర్థవంతంగా వేడ్ డిఫెన్స్ ఆడాడు. అయితే వేగంగా తిరిగిన బంతి వేడ్ బ్యాట్ ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని లెగ్ సైడ్ వైపు గాల్లోకి లేచింది.
అప్పుడాబంతి వికెట్ల ముందు పడిపోబోయింది. ఆఫ్ వికెట్ వెనుక వున్న సాహా అమాంతం గాల్లోకి డైవ్ చేశాడు. శరీరం మొత్తం గాల్లో ఉండగానే సూపర్ మేన్ తరహాలో సాహా బంతిని ఒడిసిపట్టేశాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లతో పాటు, మాథ్యూవేడ్ కూడా ఈ క్యాచ్ ను నమ్మలేకపోయాడు. అయితే పెవిలియన్ లో ఉన్న వెటరన్ లు, మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. న్యూజిలాండ్ జట్టు మాజీ దిగ్గజ కెప్టెన్ ఫ్లెమింగ్ అయితే అతని క్యాచ్ ను ఆకాశానికెత్తేశాడు. సోషల్ మీడియాలో సాహా క్యాచ్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.