: ముగిసిన ఆపరేషన్... హతమైన ఉగ్రవాది ఐసిస్ టెర్రరిస్టా?
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నడిబొడ్డున కలకలం రేపిన ఉగ్రవాదిని హతమార్చారు. కాన్పుర్ రైలు ప్రమాద ఘటనలో హస్తముందన్న విశ్వసనీయ సమాచారంతో టెర్రరిస్ట్ కోసం వల వేసిన ఏటీఎస్ దళాల ఆనుపానులు గమనించిన ఉగ్రవాది సైఫుల్లా లక్నోలోని ఠాకూర్ గంజ్ లోని ఓ ఇంట్లో దాక్కుని కాల్పులు ప్రారంభించాడు. దీంతో అప్రమత్తమైన ఏటీఎస్ దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. సుదీర్ఘ ఎదురు కాల్పుల అనంతరం సైపుల్లాను ఏటీఎస్ పోలీసులు మట్టుబెట్టాయి.
అనంతరం హతమైన ఉగ్రవాది సైపుల్లాకు ఐసిస్ తో సంబంధాలు ఉన్నాయని, వివిధ కేసుల్లో ఇతను ప్రధాన నిందితుడని పేర్కొంటున్నారు. కాగా, కాన్పూర్ లో మరో ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉగ్రవాది దాక్కున్న ఇంటిని కమాండోలు తమ అధీనంలోకి తీసుకున్నారు.