: రోడ్డు ప్రమాదంలో బెంగాలీ జానపద గాయకుడు మృతి


ప్రముఖ బెంగాలీ జానపద గాయకుడు కాళికాప్రసాద్ భట్టాచార్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తన టీం సభ్యులతో (దోహర్ బంగ్లా బ్యాండ్) కలిసి కాళికాప్రసాద్ వెళ్తున్న కారును వెనక నుంచి వచ్చిన భారీ వాహనం ఢీ కొట్టడంతో రోడ్డు పక్కనే వున్న గుంతలోకి అది దూసుకెళ్లింది. ఎన్ హెచ్-2 హైవేపై జరిగిన ఈ ఘటనలో కాళికాప్రసాద్ మృతి చెందగా, టీం సభ్యులకు గాయాలు అయ్యాయి. . గాయపడ్డ వారిని బుర్ధ్వాన్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నట్లు హుగ్లీ జిల్లా పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News