: 33 శాతం మహిళా రిజర్వేషన్స్ కు బీజేపీ కట్టుబడి ఉంది: దత్తాత్రేయ
33 శాతం మహిళా రిజర్వేషన్స్ కు బీజేపీ కట్టుబడి ఉందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన మహిళా సదస్సులో దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కార్మిక శాఖలో అవినీతి నిర్మూలన కోసం కొత్త చట్టాలు తీసుకువస్తున్నామన్నారు. స్టార్ట్ అప్ లో భాగంగా ప్రధాని మోదీ.. మహిళలకు రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో ఆశా వర్కర్స్, అంగన్ వాడీలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ఈఎస్‌ఐ పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని.. అందుకోసం ఆర్థిక శాఖ అనుమతి కోరినట్లు తెలిపారు. అలాగే మహిళలకు ప్రసూతి సెలవులు పెంచినట్లు తెలిపారు.