: విజయం కోసం ఆరాటం...భారత్ కు 2 వికెట్లు...ఆసీస్ కు 78 పరుగులు!
భారత్ ఆస్ట్రేలియా జట్లు విజయం కోసం ఆరాటపడుతున్నాయి. రెండు జట్లు తమదైన శైలిలో విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో పైచేయి సాధించేందుకు రెండు జట్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. టెయిలెండర్లతో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ హ్యాండ్స్ కోంబ్ ఆసీస్ ను విజయం దిశగా నడిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. స్వింగర్లు, యార్కర్లు, గుడ్ లెంగ్త్ బంతులతో పేసర్లు, క్యారం బంతులు, గుగ్లీలు, ఫ్లిప్పర్లు, కట్టర్లతో స్పిన్నర్లు ఆసీస్ బ్యాట్స్ మన్ ను క్రీజు బయటకు కాలుపెట్టనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో చెత్తబంతిని బౌండరీకి తరలించడమే మేలన్నట్టు హ్యాండ్స్ కోంబ్ ఆడుతున్నాడు.
ఈ క్రమంలో 8వ వికెట్ గా వచ్చిన ఒకీఫ్ ను జడేజా అవుట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. దీంతో భారత జట్టు విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉండగా, ఆస్ట్రేలియా జట్టు విజయానికి 78 పరుగుల దూరంలో ఉంది. దీంతో టీమిండియా అభిమానుల్లో ఆనందం నిండిపోయింది. తొలిటెస్టు ఆసీస్ నెగ్గినా టీమిండియా ఆధిక్యాన్ని తగ్గించిందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మ్యాచ్ ముగిసేందుకు సమయం ఉన్నప్పటికీ మైదానంలోని స్టాండ్స్ లో అభిమానులు మ్యాచ్ గెలిచిన సంబరాల్లో మునిగిపోయారు.