: మళ్లీ 13న కలుద్దాం.. జగన్ మాట్లాడుతుండగానే శాసనసభ వాయిదా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలని ఈ నెల 13కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రకటించారు. అంతకు ముందు శాసనసభలో తమ అధినేత జగన్మోహన్‌రెడ్డి మాట్లాడేందుకు అధిక సమయం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మొదట సమయం అయిపోతోందని చెప్పిన కోడెల, తిరిగి వైసీపీ నేతల డిమాండ్ కు ఒప్పుకుని జగన్ కు ఇంకాస్త సమయం ఇచ్చారు. అయితే, జగన్ అదే పనిగా ఆపకుండా మాట్లాడుతుండడంతో ఆయన మాట్లాడుతుండగానే స్పీకర్ శాసనసభను ఈ నెల 13 (సోమవారం) కి వాయిదా వేశారు. మరోవైపు శాసనమండలి కూడా సోమవారానికి వాయిదా పడింది.