: టీడీపీలోకి వచ్చేయ్... లేకపోతే రోజాలా ఇబ్బంది పడతావ్: వైసీపీ ఎమ్మెల్యేతో జలీల్ ఖాన్


టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అమరావతిలోని ఏపీ అసెంబ్లీ వద్ద సందడి చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాతో ఆయన మాట్లాడుతూ, టీడీపీలోకి ఎప్పుడు వస్తున్నావంటూ ఆయనను ప్రశ్నించారు. అంతేకాదు, టీడీపీలోకి వస్తేనే మేలని... లేకపోతే రోజాలా ఇబ్బంది పడతావంటూ చమత్కరించారు.

తన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 300 కోట్ల నిధులను మంజూరు చేశారని ముస్తఫాతో అన్నారు. వైసీపీ అంత బలమైన పార్టీ కాదని... క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ ఇంకా బలోపేతం కావాల్సి ఉందని జలీల్ ఖాన్ చెప్పారు. క్షేత్ర స్థాయిలో బలం లేనప్పటికీ, అధికారంలోకి రావాలంటూ వైసీపీ కలలు కంటోందని ఎద్దేవా చేశారు. రాజధాని రైతులు సంతోషంతో ఉన్నారని తాను వైసీపీలో ఉన్నప్పుడు జగన్ కు చెప్పానని... అయినా, ఆయన వినలేదని విమర్శించారు. తాను మంత్రి పదవి కోసం టీడీపీలోకి చేరలేదని చెప్పారు. 

  • Loading...

More Telugu News