: మత్స్యకారుడిని కాల్చిచంపడంపై రోడ్లపైకి వచ్చి ఆందోళన తెలుపుతున్న వేలాదిమంది తమిళ ప్రజలు


బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన భారతీయ మత్స్యకారుడు 22 ఏళ్ల బ్రిడ్జోపై శ్రీలంక నావికాదళం కాల్పులు జరిపి చంపేసిన విషయం తెలిసిందే. బ్రిడ్జో మృతిపై ఆయ‌న సొంత ప్రాంతం త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రంలో ఆందోళ‌న‌లు ప్రారంభ‌మ‌య్యాయి. మృతుడి ఇంటి వద్దకు వేలమంది చేరుకున్నారు. మ‌రోవైపు ఆయ‌నపై కాల్పులు జ‌రిపిన వారిపై చర్యలు తీసుకోవాల‌ని, ఈ విష‌యంపై త‌మ‌కు విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ హామీ ఇవ్వాల‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు అంటున్నారు. అప్ప‌టివ‌ర‌కు ఆయ‌న‌ మృతదేహాన్ని తీసుకోమని స్ప‌ష్టం చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష పార్టీ డీఎంకే నేత‌లు కేంద్ర స‌ర్కారు త‌మిళ జాల‌రి మృతిపై స్పందించాల‌ని అన్నారు. మత్స్యకారుడిని లంక నేవీ చంప‌డంపై స్టాలిన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌భుత్వం ప్రేక్ష‌క పాత్ర వ‌హించ‌రాద‌ని చెప్పారు. మత్స్యకారుడిని కాల్చి చంప‌డంపై రామేశ్వ‌రంలో వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. శ్రీలంక నావికాదళానికి వ్యతిరేకంగా టీవీకే పార్టీ సభ్యులు టవర్‌ ఎక్కారు. మ‌రోవైపు ఆ మత్స్యకారుడి కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడిన వ్యక్తికి రూ.లక్ష పరిహారం అందించ‌నున్న‌ట్లు తమిళనాడు సర్కారు తెలిపింది.

  • Loading...

More Telugu News