: భోపాల్-ఉజ్జయిని రైల్లో పేలుడు


భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో పేలుడు సంభవించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ పేలుడు ఘటనలో ఆరుగురికి పైగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్ లోని కలాపీపల్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు నేపథ్యంలో, అసలు ఏం జరిగిందో తెలియక ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. వెంటనే చైన్ లాగి, రైలును ఆపేసి, కిందకు దిగిపోయారు. పేలుడు వల్ల మూడు బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. గాయపడ్డ ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ పేలుడు వెనక ఏదైనా విద్రోహ చర్య ఉందా అనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News