: పాకిస్థాన్‌లో ఐదేళ్లుగా నా కూతురు వేధింపులకు గురవుతోంది: సుష్మాస్వరాజ్ కి హైదరాబాదీ తండ్రి లేఖ
పాకిస్థాన్‌లో ఉన్న తన కూతురిని విడిపించాలంటూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కి అక్బర్ అనే హైదరాబాదీ తండ్రి లేఖ రాశారు. తన కూతురు ముహమ్మదీ బేగం గతంలో మస్కట్, ఓమన్ దేశాల్లో పనిచేసిందని, అయితే, ఆ సమయంలో ఓమన్ దేశానికి చెందిన వాడనుకొని ముహమ్మద్ యూనుస్ అనే పాకిస్థాన్ దేశీయుడిని పెళ్లి చేసుకుందని చెప్పారు. ఆ విషయాన్ని తాము ఆలస్యంగా తెలుసుకున్నామని, అయితే ఇప్పుడు తన కూతురు పాకిస్థాన్‌లో నానా కష్టాలు పడుతోందని అన్నారు. ఆ దేశంలో ఐదేళ్లుగా తన కూతురు నిర్బంధంలో ఉందని చెప్పారు. తన కూతురిని ఆమె భర్త చెరలో ఉంచి వేధిస్తూ భోజనం, మందులు కూడా ఇవ్వడం లేదని ఆయన తెలుపుతూ, ఆమెను స్వదేశానికి తెప్పించేలా చూడమని విన్నవించుకున్నారు.