: నామినేషన్ వేయడానికి ముందు లోకేష్ ఏం చేశారు?


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ వేయడానికి ముందు లోకేష్ తన తండ్రి చంద్రబాబు నాయుడు కాళ్లకు నమస్కరించి, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడికి చంద్రబాబు 'గుడ్ లక్' చెప్పారు. అనంతరం, హైదరాబాదులో ఉన్న తన తల్లికి ఫోన్ చేసి, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత, ఆయన సతీమణి బ్రాహ్మణి ఫోన్ లోనే తన భర్త లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన మామ బాలకృష్ణకు ఫోన్ చేసి, తన నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ కోరారు. దీంతో, బాలయ్య వచ్చి, స్వయంగా లోకేష్ తో నామినేషన్ వేయించారు. 

  • Loading...

More Telugu News