: గన్నవరం విమానాశ్రయంలో ట్రూజెట్ విమానంలో పొగలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకున్న ఓ విమానానికి పెను ముప్పు తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పొగలు రావడంతో ఆ విషయాన్ని గమనించిన పైలట్ వెంటనే తిరిగి అదే విమానాశ్రయ రన్‌వేపై విమానాన్ని దించాడు. ఈ రోజు ఉదయం టేకాఫ్ అయిన ట్రూజెట్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుందని సంబంధిత అధికారులు వివరించారు. సాంకేతిక సమస్యల కారణంగానే ఈ పొగలు వచ్చాయని, 10 నిమిషాలకే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిందని చెప్పారు.