: చీరలు దొంగిలించినందుకు ఓ తెలంగాణ వ్యక్తి జైల్లో మగ్గుతుంటే, కోట్లు కాజేసిన వ్యక్తి హ్యాపీగా వున్నాడు: విజయ్ మాల్యాను ఉద్దేశించి భారత చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు


తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి చీరలు దొంగిలించిన నేరం కేసులో విచారణ లేకుండా జైల్లో మగ్గుతున్నాడన్న విషయమై దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జేఎస్ కేహార్, కీలక వ్యాఖ్యలు చేశారు. 5 చీరలు దొంగిలించినందుకే ముద్దాయికి ఒక సంవత్సరం జైలు శిక్ష పడిందని వ్యాఖ్యానించిన ఆయన, ఓ వ్యక్తి, కోట్ల కొద్దీ ధనాన్ని కొల్లగొట్టి, తన జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాడని ఆయన పరోక్షంగా విజయ్ మాల్యాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ కు చెందిన సీహెచ్ ఎల్లయ్య అనే వ్యక్తిని చీరల దొంగతనంపై గత సంవత్సరం పోలీసులు అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి కేసు విచారణకు రాలేదు. ఎల్లయ్య జైల్లోనే మగ్గుతున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగా, చీరల దొంగతనానికి అన్ని రోజుల పాటు నిందితుడిని కస్టడీలో ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చిందని తెలంగాణ సర్కారును కేహార్ ప్రశ్నించారు. అతను చీరలు దొంగిలించాడనటానికి సాక్ష్యాలు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కేసు విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది.

  • Loading...

More Telugu News