: వెంటవెంటనే రెండు వికెట్లు తీసి నడ్డి విరిచిన స్టార్క్... ఆపై పుజారా ఔట్ తో పీకల్లోతు కష్టాలు!
ఈ ఉదయం వికెట్లు పోకుండా స్కోరు పెరుగుతూ వస్తుందన్న ఆనందాన్ని తుడిచిపెడుతూ, ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లను తీసి భారత మిడిలార్డర్ నడ్డి విరిచాడు. క్రీజులో పాతుకుపోయిన రహానే (134 బంతుల్లో 52 పరుగులు), కరణ్ నాయర్ (0)లను అవుట్ చేశాడు. ఆ వెంటనే హాజెల్ వుడ్, 92 పరుగులు చేసిన పుజారాను తన అద్భుత బాల్ తో పెవీలియన్ దారి పట్టించడంతో, ఇక తోక మాత్రమే మిగిలింది. ప్రస్తుతం భారత స్కోరు 7 వికెట్ల నష్టానికి 242 పరుగులు కాగా, లీడ్ కేవలం 155 పరుగులు మాత్రమే.