: ‘జియో బాటలోనే’.. భారత్ లో చైనా కంపెనీల ఆఫ‌ర్లు


ఉచితంగా అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా, రోమింగ్ అంటూ టెలికాం రంగంలోకి దూసుకువ‌చ్చి మిగ‌తా కంపెనీల్లో అల‌జ‌డి రేపిన రిల‌య‌న్స్ జియో ఎఫెక్ట్ టెలికాం మార్కెట్‌పై తీవ్రంగానే ప‌డింద‌న్న విష‌యం తెలిసిందే. జియో ఇస్తోన్న పోటీని త‌ట్టుకొని నిల‌బ‌డ‌డానికి ఇప్ప‌టికే ఎయిర్‌ టెల్‌, వోడాఫోన్‌, ఐడియా లాంటి మొబైల్‌ ఆపరేటర్లు ఎన్నో ఆఫ‌ర్ల‌ను గుప్పించాయి. అయితే, తాజాగా చైనాకు చెందిన మూడు మొబైల్ ఆపరేటర్లు కూడా భార‌త్‌లో రోమింగ్ చార్జీలు రద్దుచేస్తున్నాయి. చైనా టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్, చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ కార్ప్, చైనా యునైటెడ్ నెట్వర్క్ కమ్యునికేషన్స్ గ్రూప్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇంటర్‌ ప్రావిన్స్‌ రోమింగ్‌ చార్జీలను రద్దు చేయనున్నాయి. బిల్లుల భారాన్ని తగ్గించడం ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కి మ‌రింత మెరుగైన‌ సౌలభ్యంతో పాటు ప్రోత్సాహాన్ని అందివ్వనున్నట్టు అవుతుంద‌ని ఆయా సంస్థ‌లు అభిప్రాయ‌ప‌డ్డాయి.

  • Loading...

More Telugu News