: జయలలిత నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు


దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆ భవనాన్ని మన్నార్ గుడి మాఫియా (శశికళ బంధువర్గం) ఆక్రమించేసింది. తాజాగా ఆ భవంతిని స్వాధీనం చేసుకునేందుకు ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ లు పోయస్ గార్డెన్ లోని వేదనిలయం (జయ నివాసం)కు వస్తున్నారనే వార్తలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నారు. పోయస్ గార్డెన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. వేద నిలయం లోపల, బయట కూడా పోలీసులు బారులు తీరారు.

జయ నివాసం తనకు, తన సోదరి దీపకు మాత్రమే చెందుతుందని గత నెల 23న దీపక్ ప్రకటించారు. అయితే శశికళ ఆ నివాసంలో ఎంతకాలమైనా ఉండవచ్చని చెప్పాడు. మరోవైపు, ఆ భవంతిని జయ స్మారక మండపంగా తీర్చిదిద్దాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ, పోయెస్ గార్డెన్ ను స్వాధీనం చేసుకోవడానికి దీప, దీపక్ లు వస్తున్నారనే సమాచారం తమ వద్ద లేదని తెలిపారు. ఈ విషయాన్ని ఓ లాయర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో, పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. 

  • Loading...

More Telugu News