: పన్నీర్ సెల్వం వర్గం నిరాహార దీక్షలకు డీజీపీ అనుమతి!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా పన్నీర్ సెల్వం వర్గం తలపెట్టిన నిరాహారదీక్షలు, నిరసనలకు డీజీపీ కార్యాలయం అనుమతినిచ్చింది. ఓపీఎస్ వర్గం గత నెల 28న చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో అనుమతి కోరినప్పటికీ సమాధానం రాకపోవడంతో, ఆయన వర్గం నేతలు విశ్వనాథన్, మునుస్వామి, ప్రభాకర్, మైత్రేయన్ తదితరులు డీజీపీని ఆశ్రయించారు. వచ్చే బుధవారం నాడు తాము చేపట్టనున్న దీక్షలకు అనుమతి లభించిందని, తాము ధర్మయుద్ధం చేస్తున్నామని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. శశికళ మాఫియాలో చిక్కుకున్న రాష్ట్రాన్ని కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. అమ్మ మరణంపై తమకున్న అనుమానాలన్నీ నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.