: తాబేలు పొట్టలో వందలాది నాణేలు.. అవాక్కయిన వైద్యులు!


తాబేలు పొట్టలోంచి బయటపడిన నాణేలను చూసి వైద్యులు అవాక్కయ్యారు. ఏకంగా 915 నాణేలను దాని పొట్టలోంచి తీసిన వైద్యులు అన్నింటిని మింగినా అది నిక్షేపంలా ఉండడంతో ఆశ్చర్యపోయారు. బ్యాంకాక్‌లోని  శ్రీరకా కన్జర్వేషన్‌ సెంటర్‌లోని ఓ ట్యాంకులో ఒమిన్స్ అనే సముద్రపు తాబేలు ఉంది. ఈ సెంటర్‌కు వచ్చే సందర్శకులు తాబేలు ఉండే ట్యాంకులోకి నాణేలు విసిరేవారు. వీటిలో కొన్నింటిని ఒమిన్స్ మింగేసింది.

అలా పొట్టలో కాయిన్లు పెద్ద సంఖ్యలో పేరుకుపోవడంతో ఈదలేని స్థితికి చేరుకుంది. దాని అవస్థను గుర్తించిన సెంటర్ నిర్వాహకులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు తాబేలు పొట్టలో చుట్టలా ఉన్న నాణేలను గుర్తించి విస్తుపోయారు. వెంటనే ఆపరేషన్ చేయకుంటే దాని ప్రాణాలకే ప్రమాదమని భావించి ఏడు గంటలపాటు శస్త్రచికిత్స చేశారు. దాని పొట్టలో బాల్‌లా చుట్టుకున్న 915 నాణేలను బయటకు తీసి దాని ప్రాణాలు రక్షించారు. ఒమిన్స్ కోలుకునేందుకు నెల రోజుల సమయం పడుతుందని, ఇటువంటి ఆపరేషన్ నిర్వహించడం ప్రపంచంలో ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు.  

  • Loading...

More Telugu News