: టీడీపీ కండువాతో ఇబ్బంది పడిన లోకేశ్.. కళా వెంకట్రావుతో చమత్కారం!


ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. పార్టీ కండువాతో లోపలికి ప్రవేశించిన ఆయనను అడ్డుకున్న రిటర్నింగ్ అధికారి.. కండువా తీసి లోపలికి రావాలంటూ లోకేశ్‌కు సూచించారు.

వెంటనే దానిని భుజంపై నుంచి తీసేసిన లోకేశ్.. కళా వెంకట్రావు వైపు తిరిగి ‘‘కళా గారూ.. మీరు నాకు సరిగా శిక్షణ ఇవ్వలేదు. ఇక్కడికొచ్చి దిద్దుకోవాల్సి వస్తోంది’’ అంటూ చమత్కరించారు. లోకేశ్ వ్యాఖ్యలకు స్పందించిన కళా.. తాము ఇచ్చే శిక్షణ పార్టీ కార్యక్రమాల వరకేనని, ఎన్నికల వ్యవహారాలు లాయర్లు చూసుకుంటారని బదులివ్వడంతో అక్కడ నవ్వులు విరిశాయి.

  • Loading...

More Telugu News