: వైసీపీలో కలకలం రేపిన గ్రీన్ ఇంక్!
వైసీపీలో గ్రీన్ ఇంకు కలకలం రేపింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వైఎస్సార్ సీపీ తరపున గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల నాని సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అభ్యర్థులను ప్రతిపాదిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు గ్రీన్ ఇంకును ఉపయోగించి సంతకం చేశారు. ఆ తర్వాత వారికి టెన్షన్ పట్టుకుంది. గ్రీన్ ఇంకుతో సంతకం చేసిన తమ నామినేషన్లు చెల్లుతాయో, లేదోనని వారు చాలా ఆదుర్దా పడ్డారు. అయితే ఎన్నికల అధికారులు ఆ నామినేషన్లు చెల్లుతాయని ప్రకటించడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.