: రేపు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరనున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్
విశాఖపట్టణం నుంచి వెళ్లాల్సిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ రేపు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. సాధారణంగా విశాఖ నుంచి ఉదయం 6.15 గంటలకు ఈ ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుంది. గుంటూరు లైన్ లో రద్దీ కారణంగా రెండు గంటలు ఆలస్యంగా.. అంటే 8.15 గంటలకు ఈ ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుందని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు.