: స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్న కమెడియన్ కపిల్ శర్మ!
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ఓ స్ఫూర్తి దాయక నిర్ణయం తీసుకున్నాడు. మరణానంతరం తన కళ్లను దానం చేస్తానని ప్రతిఙ్ఞ చేశాడు. గత నెలలో అంధుల టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై టీమిండియా విజయం సాధించింది. కపిల్ శర్మ షోలో ఈ జట్టు తాజాగా పాల్గొంది. ఈ నేపథ్యంలోనే కపిల్ శర్మ పై విధంగా ప్రతిఙ్ఞ చేశాడు. తన కళ్ల ద్వారా మరొకరు ఈ లోకాన్ని చూడగలరు అనుకుంటే, తాను ఎంతో సంతోషంగా ముందుకు వస్తానని అన్నాడు. అయితే, కపిల్ శర్మ ప్రకటనతో ఆయన అభిమానులు చాలా మంది నేత్రదానం చేసేందుకు ముందుకు వస్తుండటం విశేషం.