: నా నృత్య ప్రదర్శనను తిలకించేందుకు నాన్న రావట్లేదు: ఐశ్వర్యా రజనీకాంత్


ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ)లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. అయితే, ఈ ప్రదర్శన చూసేందుకు తన కుటుంబం నుంచి ఎవరూ న్యూయార్క్ రావడం లేదని ఐశ్వర్య చెప్పింది. ‘అప్పా రోబో 2.0 సినిమా షూటింగ్ లో రజనీకాంత్ బిజీగా ఉండగా, తన భర్త ధనుష్, సోదరి సౌందర్య వీఐపీ-2 సినిమా పనుల్లో తీరిక లేకుండా ఉన్నారని ఐశ్వర్య పేర్కొన్నారు. తన పిల్లలను చూసుకునేందుకు తన తల్లి కూడా చెన్నైలోనే ఉండాల్సి వచ్చిందని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా, యూఎన్ఓ లో భరత నాట్య ప్రదర్శన ఇస్తున్న తొలి భారతీయురాలుగా ఐశ్వర్య గుర్తింపు పొందనుండటం విశేషం.

  • Loading...

More Telugu News