: హోలీ పండుగ సందర్భంగా.. ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్!
ప్రత్యేక డిస్కౌంటు ఆఫర్లను తీసుకొచ్చి ప్రయాణికులను ఆకర్షిస్తోన్న ఎయిర్ ఇండియా, ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ ల బాటలోనే పయనిస్తూ హోలీ పండుగ సందర్భంగా తమ ప్రయాణికుల ముందుకు బంపర్ ఆఫర్ ను తీసుకొస్తుంది ఎయిర్ ఏసియా. హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణాలకు రూ.1,499కే విమాన టిక్కెట్లను విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ నెల 12 వరకు ఈ ఆఫర్ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 వరకు ప్రయాణాలకు ఈ స్పెషల్ ఫేర్స్ వర్తించనున్నాయని చెప్పింది. ఇంఫాల్-గౌహతి మధ్య ప్రయాణాలకు రూ.1999, పూణే-జైపూర్ మధ్య రూ.2,999, పూణే-బెంగళూరు, విశాఖపట్నం-బెంగళూరుల మధ్య రూ.2,399 లకే టికెట్లను అందిస్తున్నట్లు తెలిపింది.