: రష్యాలో ఈ మోడల్ నోకియా ఫోన్ ధర లక్ష రూపాయల పైమాటే!


కొత్తగా మొబైల్ ఫోన్లు వస్తున్న రోజుల్లో ‘నోకియా’ 3310 మోడల్ పైనే అందరి దృష్టి ఉండేది. ఇప్పుడీ మోడల్ ఫోన్ కు కొత్త హంగులు చేర్చి తాజాగా మార్కెట్ లోకి  విడుదల చేశారు. దీని ధర 49 యూరోలు.. మన కరెన్సీలో అయితే రూ.3,400 అని నోకియా మాతృసంస్థ హెచ్ఎండీ గ్లోబల్ నిర్ణయించింది. అయితే, రష్యాలో మాత్రం ఈ మోడల్ ఫోన్ ధర 99 వేల రూబీలు. అంటే, మన కరెన్సీలో సుమారు ఒక లక్షా పదమూడు వేల ఐదువందలు!

ఈ మోడల్ ఫోన్ ధరలో ఇంత భారీ వ్యత్యాసం ఎలా వచ్చిందనే అనుమానం రాకమానదు. దీనికి కారణం.. రష్యాకు చెందిన లగ్జరీ ఫోన్ల తయారీ సంస్థ కేవియర్, నోకియా 3310 ఫోన్ ను ప్రీమియం మొబైల్ గా మార్చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం బంగారు వర్ణంలో ఉన్న ఆయన ఫొటోను ఆ ఫోన్ వెనుక భాగంలో ఉంచింది. అలాగే, ఫోన్ ను గోల్డ్ ఫినిష్ తో కూడిన మెస్డ్ టైటానియం కవరుతో కప్పారు. అందంగా కనిపించే ఈ ఫోన్ లో ఫీచర్లు మాత్రం అలానే ఉన్నాయి. కేవియర్ వెబ్ సైట్ లో ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ లు ప్రారంభమయ్యాయి.

  • Loading...

More Telugu News