: వావ్...పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో నటించాలనగానే ఎలా ఫీలయ్యానో తెలుసా?: అను ఇమ్మాన్యుయేల్
'పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో నటించే ఆఫర్ ఎవరికైనా వస్తే ఎలా ఉంటుంది? కాళ్లు గాల్లో తేలిపోయినట్టుంటుంది కదా... నాక్కూడా అచ్చం అలాగే అనిపించింది' అంటోంది వర్థమాన నటి అను ఇమ్మాన్యుయేల్. 'కిట్టుగాడున్నాడు జాగ్రత్త' సినిమా ప్రమోషన్ సందర్భంగా మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ సినిమా ఆఫర్ గురించి చెప్పింది.
టాలీవుడ్ లో ఎంతోమంది పవన్ కల్యాణ్ తో నటించాలని ఆశపడుతుంటారని, అలాంటిది తనలాంటి వర్థమాన నటికి పవన్ కల్యాణ్ తో సినిమా అనగానే చాలా గొప్పగా ఫీలయ్యానని చెప్పింది. ఒక రకంగా చెప్పాలంటే, కల నిజమైందని చెప్పింది. తెలుగులో అల్లు అర్జున్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులతో నటించాలని ఉందని తెలిపింది. నాని, రాజ్ తరుణ్ ఇద్దరూ సహనటులతో బాగా మసలుకుంటారని, ఇద్దరూ చాలా కష్టపడతారని చెప్పింది. తన కెరీర్ ఆరంభంలోనే మంచి అవకాశాలు తలుపుతట్టడం తన అదృష్టమని తెలిపింది.