: స్వహస్తాలతో గోవులకు మేత వేసి.. అరటి పళ్లు తినిపించిన నరేంద్ర మోదీ
ఉత్తరప్రదేశ్‌లో చివరిదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలోని తన సొంత నియోజక వర్గం వారణాసిలో జరుగుతున్న ర్యాలీల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అక్కడి గఢ్వాఘాట్ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఆయన రెండు నల్ల గోవులకు స్వహస్తాలతో మేత వేయడమే కాకుండా, అరటి పళ్లు కూడా తినిపించారు. సదరు ఆశ్రమ మహంత్ షరానందతో ఆయన కాసేపు మాట్లాడారు. ఈ అరుదైన ఘటన బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొల్పింది. ఆశ్రమంలో గడిపిన అనంతరం మోదీ అక్కడి నుంచి బయలుదేరారు.