: వచ్చే ఏడాది కల్లా లండన్‌లా మారిపోనున్న ఢిల్లీ.. హామీ ఇచ్చిన కేజ్రీవాల్


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వాసులకు బంపరాఫర్ ఇచ్చారు. ఏప్రిల్ లో జరగనున్న మునిసిపల్  ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కనుక విజయం సాధిస్తే వచ్చే ఏడాది నాటికి ఢిల్లీని లండన్‌లా మార్చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఉత్తమ్‌నగర్‌లో ఆదివారం ఆయన మురుగు కాల్వలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో పురపాలక సంస్థలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు.

‘‘నేను బాగా  పోరాడుతున్నానని వారు చెబుతున్నారు. నిజమే. అయితే ఆ పోరాటం నా భార్య గురించో, పిల్లల గురించో కాదు. నేను మీ హక్కుల కోసం పోరాడుతున్నాను. ఇప్పుడు చెప్పండి.. నేను  పోరాడాలా? వద్దా?’’ అని ప్రజలను ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.

అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం కోసం పోరాడతానని హామీ ఇచ్చారు. పరిశుభ్రత అనేది పురపాలక సంస్థల విధి కావడంతో ఈ విషయంలో తాను నిస్సహాయుడిగా ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో 70కి 67 సీట్లు కట్టబెట్టారు. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలు వస్తున్నాయి. అందులో ‘ఆప్‌కు విజయం కట్టబెడితే నగరాన్ని మునుపెన్నడూ చూడని విధంగా అభివృద్ధి చేస్తా’’ అని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News