: స్మార్ట్‌ఫోన్లలో వేలాదిగా క్రిములు.. తొలగించలేమంటూ చేతులెత్తేసిన నిపుణులు!


నిత్యం మనం ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌పై వేలాది క్రిములు గూడుకట్టుకుని ఉన్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. 27 హ్యాండ్‌సెట్లపై అధ్యయనం నిర్వహించగా 500 రకాల బ్యాక్టీరియాతోపాటు 30 రకాల ఫంగస్‌లు ఉన్నట్టు పుణెకు చెందిన ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ క్రిములు చాలా మొండివని, మందులకు లొంగే రకం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. వీటి నిర్మూలనకు మందులు ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది.

స్మార్ట్‌ఫోన్లపై ఉన్న ఈ క్రిములను పూర్తిగా తొలగించలేమని, అయితే ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసిన తర్వాత సబ్బు నీటిలో ముంచిన గుడ్డతో శుభ్రం చేయడం ద్వారా బ్యాక్టీరియా మరింత వ్యాపించకుండా అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా బాత్రూంలో కంటే మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ కీ బోర్డులపైనే క్రిములు ఎక్కువగా ఉంటాయని గతంలో బ్రిటన్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

  • Loading...

More Telugu News