: నటి భావన కేసు.. ‘లై డిటెక్టర్’ పరీక్ష వద్దంటున్న నిందితుడు!


తనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించవద్దని, అందుకు తాను సిద్ధంగా లేనని కేరళ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ కోర్టుకు చెప్పాడు. పల్సర్ సునీని అలువా కోర్టులో నిన్న ప్రవేశపెట్టారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తవ్వాలంటే నిందితుడికి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించాలని, ఈ కేసు విచారణకు సునీ సహకరించడం లేదని, పొంతన లేని విషయాలు చెబుతున్నాడని పోలీసులు కోర్టుకు విన్నవించారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న విగీష్, సునీలకు ఈ నెల 10 వరకు పోలీస్ కస్టడీని కోర్టు పొడిగించింది. 

  • Loading...

More Telugu News