: బీఎస్పీ అభ్యర్థిపై అత్యాచార కేసు... అరెస్ట్ చేసేందుకు పోలీసుల సోదాలు
యూపీలోని అయోధ్య నియోజకవర్గానికి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాజ్మీ సిద్ధిఖీ సహా ఆరుగురిపై ఓ మహిళ అత్యాచార కేసు పెట్టడంతో, పోలీసులు ఆయన ఎక్కడున్నాడో గుర్తించేందుకు భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. మిగతా ఐదుగురినీ అరెస్ట్ చేశామని, బాజ్మీ మాత్రం తప్పించుకున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, అయోధ్యలో తన విజయం ఖాయమని తెలుసుకున్న ప్రత్యర్థులు, ఇలా తనను ఇరికించాలని ప్రయత్నిస్తున్నాయని బాజ్మీ మీడియాతో అన్నారు.
కాగా, ఫైజాబాద్ లోని పురానీ సబ్జీ మండీ ప్రాంతంలోని తన ఇంట్లోకి గత రాత్రి బలవంతంగా ప్రవేశించిన బాజ్మీ బృందం తనపై అత్యాచారానికి ఒడిగట్టారని, దివ్యాంగురాలైన తన బంధువైన మహిళను చావగొట్టారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. కాగా, బాజ్మీపై ఫైజాబాద్, లక్నో ప్రాంతాల్లో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని, అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు.