: అశ్విన్ ఖాతాలో ఆస్ట్రేలియా తొలి వికెట్!
బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో భారత స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్ తొలి వికెట్ ను తీసి, ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చాడు. కుదురుకుని ఆడితే, బ్యాటింగ్ కు సహకరించేలా ఉన్న ఈ పిచ్, మరోవైపు బౌలర్లకు కూడా అనుకూలంగా ఉన్న వేళ, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ను నిన్న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే పిచ్ పై భారత్ ఘోరంగా విఫలమై కేవలం 189 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత 40 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఈ ఉదయం ఆస్ట్రేలియా ఆటను ప్రారంభించగా, 22వ ఓవర్ తొలి బాల్ కు వార్నర్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు అశ్విన్. 67 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 33 పరుగులు చేసిన వార్నర్ అవుటైన తరువాత మరో ఓపెనర్ రెన్షాకు తోడుగా స్మిత్ వచ్చి చేరగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 53 పరుగులు.