: వెండితెర విలన్ గా మారిన 'లింగ' నిర్మాత రాక్ లైన్ వెంకటేష్
పలు తెలుగు, తమిళ చిత్రాలను నిర్మించిన రాక్ లైన్ వెంకటేష్, ప్రతినాయకుడిగా వెండితెరపై మెరవనున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడు బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాచ్చియార్' అనే సినిమాలో వెంకటేష్ విలన్ గా నటిస్తున్నారు. జ్యోతిక, జీవీ ప్రకాష్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల చెన్నైలో మొదలైంది. కాగా, బాలా తన పలు చిత్రాల్లో నిర్మాతలనే విలన్లుగా ఎంచుకుంటూ ఉంటారు. ‘నాన్ కడవుళ్’ సినిమాలో నిర్మాత అళగన్ తమిళ్ మణి, ‘పరదేశి’లో జేడి, ‘తారా తప్పట్టై’లో నిర్మాత ఆర్‌కే సురేష్‌లను ఆయన విలన్లుగా చేసిన సంగతి తెలిసిందే.