: పేదలు రూపాయి రూపాయి కూడబెట్టిన సొమ్మది... చంద్రబాబు కల్పించుకోవాలి: టీటీడీ హుండీ పాత నోట్లపై స్వరూపానందేంద్ర


తిరుమల వెంకటేశ్వరుని హుండీలోకి వచ్చి చేరిన రూ. 8.29 కోట్ల విలువైన పాత నోట్లను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర వ్యాఖ్యానించారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన, కేంద్రంతో మంచి స్నేహ సంబంధాలున్నందుకు పాత నోట్ల చెల్లుబాటుకు మార్గం చూడాలని చంద్రబాబును కోరారు. ప్రజలు రూపాయి, రూపాయి కూడబెట్టుకుని, తిరుమలకు వచ్చి తమ కష్టార్జితాన్ని హుండీ ద్వారా స్వామికి సమర్పిస్తారని గుర్తు చేసిన ఆయన, అవి చెల్లబోవని చెప్పడం తగదని అన్నారు. ఇకపై భక్తులు హుండీలో పాత నోట్లను వేయవద్దని, కొత్త నోట్లతోనే మొక్కు తీరుతుందని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News