: సాక్షీ మాలిక్ చెబుతున్నది అబద్ధం... రూ. 2.5 కోట్లు ఇచ్చాం: హర్యానా


రెజ్లింగ్ లో భారత్ కు ఒలింపిక్ పతకాన్ని సాధించి తెచ్చిన సాక్షీ మాలిక్, చేసిన ఆరోపణలను హర్యానా ప్రభుత్వం ఖండించింది. తాను పతకం సాధించిన తరువాత ప్రభుత్వం ఇస్తానన్న నజరానాలు అందలేదని, ఆ ప్రకటనలు మీడియాకు మాత్రమే పరిమితమయ్యాయని సాక్షీ ఆరోపించగా, హర్యానా మంత్రి అనిల్ విజ్ స్పందించారు. ఆమె అబద్ధాలు చెబుతోందని అన్నారు. ప్రభుత్వం ఆమెకు రూ. 2.5 కోట్లను ఇచ్చిందని, ఇందుకు సంబంధించిన చెక్కును ఆమె స్వీకరించిందని స్పష్టం చేశారు. ఆమె కోరిక మేరకు ఎండీ యూనివర్శిటీలో ఒక ఉద్యోగాన్ని కూడా సృష్టించామని తెలిపారు.

  • Loading...

More Telugu News