: యూపీ మంత్రిపై నాన్ బెయిబుల్ వారెంట్... లుక్ ఔట్ నోటీసుల జారీ
గ్యాంగ్ రేపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ వివాదాస్పద మంత్రి గాయత్రి ప్రజాపతి, మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ లను న్యాయస్థానం జారీచేసింది. దీంతో పాటు ఆయన పాస్ పోర్టును నాలుగు వారాలపాటు సీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనపై లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో అన్ని విమానాశ్రయాల్లో ఆయనపై నిఘా ఉంది. ఆయన దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి.
అమేధీ అసెంబ్లీకి పోటీ చేస్తున్న ప్రజాపతిని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ కు ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ప్రజాపతిపై గతంలో అఖిలేష్ చర్యలు తీసుకున్నారు. అయితే ములాయం ఒత్తిడితో ఆయన సీటిప్పించుకున్నారు. దీంతో అఖిలేష్ ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై మైనర్ పై గ్యాంగ్ రేప్, బాధితురాలి తల్లిపై దాడి కేసులు సుప్రీం ఆదేశాలతో నమోదయ్యాయి.