: జేసీ బ్రదర్స్ టీడీపీలోకి రాక ముందు నుంచే నేను టీడీపీలో ఉన్నా!: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ( జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా తనకు సపోర్ట్ చేయడం వల్లే తాను ఎమ్మెల్సీగా గెలుపొందానని తెలిపారు. ఒకే కుటుంబం నుంచి టీడీపీలో ముగ్గురికి (జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, దీపక్ రెడ్డి) అవకాశం రావడంపై మీడియా ప్రశ్నించగా... తమ కుటుంబంలో ఎమ్మెల్సీలు చంద్రమోహన్ రెడ్డి, సతీష్ రెడ్డిలతో పాటు మొత్తం పది మంది టీడీపీలో ఉన్నారని చెప్పారు. జేసీ ఫ్యామిలీ టీడీపీలోకి రాక ముందు నుంచే తాను టీడీపీలో ఉన్నానని తెలిపారు.