: కేసీఆర్ ను తయారు చేసింది కూడా చంద్రబాబే!: గాలి ముద్దుకృష్ణమ


తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా చంద్రబాబు కుట్రలు ఆపడం లేదంటూ టీఆర్ఎస్ ఎంపీ కవిత, మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. హైదరాబాదుని అభివృద్ధి చేసిందే చంద్రబాబు అని... ఆయన వల్లే హైదరాబాదుకు ఇప్పుడు ఇంత ఆదాయం సమకూరుతోందని చెప్పారు. చంద్రబాబుపై కవిత, ఈటల వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తయారు చేసింది కూడా చంద్రబాబే అని గుర్తు చేశారు. ఏపీలో కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారన్న దిగజారుడు వ్యాఖ్యలను మరోసారి చేయవద్దని సూచించారు. తెలంగాణలో టీడీపీని మూసేయడం కాదు... టీఆర్ఎస్ పార్టీనే ప్రజలు మూసేస్తారని అన్నారు.

  • Loading...

More Telugu News