: బాంబుందని సరదాగా జోకేసి.. చిక్కుల్లో పడ్డ ముంబై మోడల్!


కొంత మంది జోక్స్ చెప్పి నవ్విస్తారు.. మరి కొందరు ప్రాక్టికల్ జోక్స్ వేసి ఆశ్చర్యపోయేలా చేస్తారు. అలాంటి ప్రయత్నం చేసిన ఓ మోడల్ షాక్ తిన్న ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... స్నేహితురాలి తల్లికి బాగోలేదన్న సమాచారంతో ఆమెకు తోడుగా ఉండేందుకు గత రాత్రి 9 గంటలకు ముంబై ఎయిర్ పోర్టులో 2వ టెర్మినస్ నుంచి ఢిల్లీకి విమానం బయల్దేరుతుందనగా విమానం ఎక్కిన మోడల్ కాంచన్ ఠాగూర్... అక్కడ తనిఖీ చేస్తున్న సెక్యూరిటీ గార్డుతో సరదాగా తన స్నేహితురాలి బ్యాగులో బాంబు ఉందనీ, జాగ్రత్తగా తనిఖీ చేయాలని వేళాకోళమాడింది.

దీనిని సీరియస్ గా తీసుకున్న సెక్యురిటీ గార్డు సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేశాడు. దీంతో విమానాన్ని ఆపేశారు. ఆమెతోపాటు బయల్దేరిన ఆమె ముగ్గురు స్నేహితురాళ్లను కిందికి దించేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. తరువాత ఆమె బాంబు మాట ఒట్టిదేననీ, సరదాగా అలా అన్నాననీ ఆ మోడల్ ఎంత వాదించినా అధికారులు పట్టించుకోలేదు సరికదా, ఆమెపై ఐపీసీ 505(1)(బి) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. విచారణ పూర్తయ్యే వరకు ఆమెతో పాటు ఆమె మిత్రులు నగరాన్ని విడిచి వెళ్లరాదని అధికారులు ఆదేశించారు.

  • Loading...

More Telugu News